హైదరాబాద్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా చేవెళ్ల మాజీ జెడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు నోట్ బుక్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల ఏసీసీ కిషన్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మన జీవితంలో తల్లిదండ్రుల… తర్వాత ముఖ్యమైన స్థానం ఉపాధ్యాయులదేన్నారు. వారు మనకు చదువుతో పాటు మంచి విలువలు కూడా నేర్పిస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు లేకపోతే జ్ఞానం అనే వెలుగు మన జీవితాల్లో చేరేది కాదన్నారు. వారు చూపే మార్గమే మన విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు. వారి వల్లే మన భవిష్యత్తు అభివృద్ధి దిశగా సాగుతుందని వివరించారు. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామన్నారు.

ఈరోజు మన ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలు చెప్పే ప్రత్యేక రోజని వెల్లడించారు. దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. అంతేకాదు ఎన్నో గొప్ప రచనలతో, మాటలతో ఆయన దేశంలోని ప్రజలను ప్రభావితం చేశారని గుర్తుకు చేసుకున్నారు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించమని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలోమార్కెట్ కమిటీ డైరెక్టర్ జూకన్నగారి లక్ష్మారెడ్డి(జేఎల్ఆర్), నత్తి కృష్ణారెడ్డి(ఎన్ కేఆర్ ), కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply