బీఆర్ ఎస్‌లో చేరినక‌…

బీఆర్ ఎస్‌లో చేరినక‌…

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ నాయకులు పెంజర్ల లక్ష్మారెడ్డి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ(BRS party)లో చేరారు. ఆయనకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని చెప్పారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు నచ్చక చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి(Lakshmar Reddy) తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గోవర్ధన్ కు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పొగాకు బాపురెడ్డి ,మట్టే మైపాల్ రెడ్డి, పెంటల సత్యాగౌడ్ ,రవి ఉన్నారు.

Leave a Reply