after akhanda2 | బన్నీ–బోయపాటి సినిమా ఫిక్సా?

after akhanda2 | బన్నీ–బోయపాటి సినిమా ఫిక్సా?

after akhanda2 | అఖండ 2 తర్వాత బోయపాటి నెక్ట్స్ సినిమా ఎవరిది?
బన్నీకి ఫుల్ నెరేషన్ ఇచ్చిన బోయపాటి
ముంబైలో బన్నీ–బోయపాటి భేటీ
రానాతో బోయపాటి సినిమా సెట్ అయ్యే ఛాన్స్?

after akhanda2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి.. ఈ ఇద్దరు కలిసి సరైనోడు సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. ఇంత వరకు సెట్ కాలేదు. ఆమధ్య ఈ క్రేజీ కాంబో మూవీ గురించి వార్తలు వచ్చాయి కానీ.. ఏది అనౌన్స్ మెంట్ రాలేదు. ఇప్పుడు బన్నీ, బోయపాటి కలిసారనేది లేటెస్ట్ న్యూస్. మరి.. ఈసారి ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందా..? అసలు ఏం జరిగింది..?

after akhanda2
after akhanda2

after akhanda2 | బోయపాటితో చేసేది ఎవరు..


బోయపాటి శ్రీను అఖండ 2 తర్వాత సినిమా ఎవరితో అనేది సమాధానం లేని ప్రశ్నలా తయారైంది. ఈ సినిమా కనుక ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ అయ్యుంటే.. వేరే లెవల్లో ఉండేది. కానీ.. అఖండ 2 అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బోయపాటి నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తాడు..? ఇప్పుడు బోయపాటితో సినిమా చేసేందుకు ఎవరు రెడీగా ఉన్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. హీరోలు ఎవరూ అందుబాటులో లేరు కానీ.. ఆయన మాత్రం తన ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. ఆమధ్య అఖండ 2 తర్వాత బోయపాటి.. బన్నీతో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి కానీ.. బన్నీ కమిట్ మెంట్స్ వేరు.. వరుసగా ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నాడు.

పట్టువదలని విక్రమార్కుడు..
బోయపాటి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆమధ్య బన్నీకి ఓ స్టోరీ లైన్ వినిపించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కలిసి ఫుల్ స్టోరీ వినిపించారట. ఈసారి గెటప్ తో సహా ఫుల్ నెరేషన్ ఇచ్చారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇటీవల బోయపాటి ముంబాయి వెళ్లారు. బాలీవుడ్ స్టార్ రణ్‌ వీర్ సింగ్ తో కలిసి బోయపాటి సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో బోయపాటి ముంబాయి వెళ్లారు అనగానే రణ్‌ వీర్ సింగ్ కోసం అనుకున్నారు కానీ.. కాదు.. బన్నీ కోసం వెళ్లారట. బన్నీ అట్లీతో చేస్తున్న మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అక్కడ బన్నీకి ఫుల్ నెరేషన్ ఇచ్చారట. కథ బన్నీకి బాగా నచ్చిందని తెలిసింది.

ముంబాయిలో.. బన్నీ, బోయపాటి..
బన్నీకి బోయపాటి చెప్పిన కథ బాగా నచ్చినా.. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అందుకనే.. బోయపాటి మరో ఆప్షన్ గా దగ్గుబాటి రానా కోసం కూడా బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం. త్వరలో రానాకు కథ చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బన్నీ, రణ్‌ వీర్ కంటే రానా మంచి అప్షన్ అనే టాక్ వినిపిస్తోంది. రానా కూడా మంచి క్రేజ్ ప్రాజెక్ట్, స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని తపిస్తున్నారు. మరి.. రానాతో అయినా బోయపాటి ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో చూడాలి.

click here to read more

Leave a Reply