ఎండకాలానికి ముందస్తు సన్నాహాలు..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : 2026 ఎండాకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరా(Electricity supply)లో అంతరాయం లేకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ(Electricity Department) వారంలో మూడు రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఇంచార్జి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్) కల్ముల ఆంజనేయులు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో విద్యుత్త్ శాఖ సిబ్బంది వారంలో మూడు రోజులు అనగా మంగళ, గురు, శనివారాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా లైన్ల తనిఖీ, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు(Repairs), సబ్‌స్టేషన్ల పరిశీలన, విద్యుత్ లైన్ కింద ఉన్న చెట్ల కొమ్మల(Tree Branches) తొలగింపు పనులు చేపడతారని, ఆ సమయంలో జరిగే అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు, రైతులు, ప్రజలు, వ్యాపారస్తులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

