Adilabad | గంజాయి ముఠా అరెస్ట్..
Adilabad | ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్(Subhash Nagar), గాంధీనగర్ కాలునికి చెందిన కొంతమంది వ్యక్తులు గంజాయి ని విక్రయిస్తున్నారని సమాచారాన్ని అందుకున్న ఖానాపూర్ పోలీసులు చాకచక్యంగా మాటు వేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దాంతోపాటు ఇద్దరు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసినట్టు ఖానాపూర్ పోలీస్(Khanapur Police) తెలిపారు. ఖానాపూర్ సిఐ సిహెచ్ అజయ్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ ఆయకట్టు కాలువ సమీపంలో నిషేధిత గంజాయి విక్రయాలు జరుగుతుండగా ఖానాపూర్ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గురువారం అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ చెందిన బోదాసు రాము గాంధీనగర్ కాలనీకి చెందిన పుట్ట మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో వారిద్దరిని పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు మూడు కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకుందామని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో మరో నిందితుడు ఉన్నాడని అతని కూడా అదుపులోకి తీసుకుంటామని సీఐ వెల్లడించారు. నిషేధిత గంజాయి విక్రయాలు కానీ వాటిని ప్రోత్సహించిన వారు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ వెల్లడించారు. విద్యార్థులు గంజాయికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
గంజాయి పండించినట్లు లేదా విక్రయించినట్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ సిహెచ్ అజయ్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండవ ఎస్ ఐ జ్యోతి హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

