మద్యానికి బానిసై…
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఈ రోజు మృది చెందినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు(Anjaneyu) తెలిపారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నర్సింలు ఎలాంటి పనులు చేయకుండా ప్రతిరోజు మద్యం తాగేవాడని కుటుంబ సభ్యులు చెప్పారు.
మద్యం కోసం డబ్బులు ఇవ్వమని ఇంట్లో అడగగా కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు తెలిపారు. దీంతో జీవితం పై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. కుటుంబ సభ్యులు(family members) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

