ADB | ఆదివాసుల ధర్మ యుద్ధ సభ బిగ్ సక్సెస్..

  • ఆదివాసుల డిమాండ్లపై తీర్మానాలు
  • చట్టసభల ద్వారానే ఆదివాసుల హక్కులు దక్కించుకోవాలి
  • ఎమ్మెల్యే జొజ్జు ప‌టేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : రాజ్యాంగపరంగా ఆదివాసుల కల్పిస్తున్న హక్కులు చట్టాలను చట్టసభల ద్వారా ఐక్యతతో సాధించుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ ఎంపీడీవో గ్రౌండ్లో తుడుం దెబ్బ ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్ తో ‘‘ఆదివాసీల ధర్మ యుద్ధ సభ’’ ఘనంగా నిర్వహించారు.

ఈ సభకు ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది ఆదివాసులు తరలిరావడంతో ఎంపీడీవో కార్యాలయ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ… లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టు నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు వస్తే ఆ విషయంపై అందరం కలిసికట్టుగా సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు.

సమస్య పరిష్కారానికి న్యాయబద్ధమైన చట్టబద్ధమైన చట్టసభల్లోని పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా ఆదివాసీలకు కోసం జీవో నెంబర్ మూడు గురించి ఎన్నో ఉద్యమాలు చేసిన పరిష్కారం కావడం లేదని దీనికి ప్రధాన పరిష్కారం చట్టసభల్లోని తెలుసుకోవాలని పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కృషి చేయాలి అవసరం ఉందన్నారు.

తాను అధికారంలో ఉన్నప్పటికీ తమ సమాజం కోసం కృషి చేస్తానని ధర్మ యుద్ధ సభలో తీర్మానించిన అంశాలను ఆదివాసి సంఘాల మేధావులు నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సభకు ఎంపీ నగేష్, మాజీ ఎంపీ సోయంబాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రాలేదని, సభలో విమర్శలు చేయడం తగదని అన్నారు వారు కూడా ఆదివాసుల హక్కుల కోసం అనేకమార్లు ఉద్యమాల్లో పాల్గొని కృషి చేశారని ఎవరి మీద విమర్శలు చేయకుండా అందరు కలిసి సమస్య పరిష్కారాన్ని కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు.

మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలు పరిష్కారమయ్యేలా అన్ని ఆదివాసి ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆమె అభిప్రాయంలో, ఆదివాసీలకు సంబంధించిన అన్యాయాలను తొలగించేందుకు ఏకతాటిపైకరావడం అత్యవసరమని పేర్కొన్నారు.

ఆదివాసి తొమ్మిది తెగల సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ 1950లో లంబాడీలు ఎస్టీ జాబితాలో లేవని, కానీ 1976 నుండి ఇప్పటివరకు ఎస్టీ జాబితాలోకి చేరి ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఆదివాసీల హక్కులను హరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ అన్యాయాన్ని నివారించే వరకు శాంతియుత, న్యాయపరమైన ఉద్యమాలతో ముందుకు సాగాలని వారు స్పష్టం చేశారు.

ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కేసు ఫైనల్ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే ఆదివాసీలకు అనుకూల తీర్పు రావచ్చని రాష్ట్ర ఆదివాసి సంఘాల నాయకులు, ఆదివాసి న్యాయవాదులు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం చట్టపరమైన పోరాటంతో పాటు సంఘీభావంతో ముందుకు సాగుతామని నాయకులు ఒకకంఠంతో ప్రకటించారు.

ఈ సందర్భంగా సభలో పలు తీర్మానాలు ఆమోదించారు.. ముఖ్యంగా, చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, 1976 నుండి ఎస్టీ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికెట్లను తిరిగి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. షెడ్యూల్డ్ ఏరియాల్లోని లంబాడీలను అక్కడి నుండి మార్చి ఆదివాసులకు న్యాయం చేయాలని, ఆదివాసులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, పివిటిజీ ప్రాంతాల్లో విద్యాసంస్థల్లో ఆదివాసులకు అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. అదేవిధంగా, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నియామకాలలో లంబాడీలను పరిగణలోకి తీసుకోకూడదని డిమాండ్ చేశారు.

ఈ ధర్మయుద్ధ సభలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కోట్నాక్ విజయ్‌కుమార్, జిసిసి చైర్మన్ కోట్నాక్ తిరుపతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఉమ్మడి జిల్లా సర్మిడి మెస్రం దుర్గు, మహారాష్ట్ర, ఖమ్మం, తెలంగాణలోని తొమ్మిది తెగల ఆదివాసి సంఘాల రాష్ట్ర నాయకులు, ఆదివాసి న్యాయవాదులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లాల మరియు మండలాల నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.

Leave a Reply