నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేసి గంజాయితోపాటు మాదకద్రవ్యాల నియంత్రణపై ఉక్కు పాదం మోపుతామని ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా నుండి బదిలీపై వచ్చిన నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఆదిలాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద నిఘా మరింత ముమ్మరం చేసి గంజాయి రవాణా కు కళ్లెం వేస్తామని, అసాoఘిక కార్యకలాపాలను నియంత్రిస్తామని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
ఆదిలాబాద్ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి ప్రజలకు ఇబ్బందులు దూరం చేస్తామని ఎస్పీ అన్నారు. రౌడీ షీటర్ల ఆగడాలు సహించేది లేదని స్పష్టం చేశారు. నూతన ఆలోచనలు, పోలీసు సంస్కరణలను పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు మరింత చేరువ అవుతామన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న ఎస్పీ గౌస్ అలo కు పోలీసులు అధికారులు, వీడుకోలు పలికారు. గౌస్ అలం ఏడాది కాలంలో చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతల పరిరక్షణకు పకడ్బందీచర్యలు తీసుకుంటామన్నారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీకి అదనపు ఎస్పీ బి సురేందర్రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, హసీబుల్లా, ఇన్స్పెక్టర్లు సునీల్ రావు, కరుణాకర్, శ్రీనివాస్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ తోట మల్లేష్ , పోలీసు సిబ్బంది స్వాగతం పలికారు.