ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం..

ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం..

కర్నూలు నగరంలో 722 మ్యాట్రిక్స్ సిసి కెమెరాలు
100 A I ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాల నిఘా
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు… ఈ చలాన్ల తో జరిమానాలు.
పోలీసు కమాండ్ కంట్రోల్ నుండి సిసి కెమెరాల పర్యవేక్షణ.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూల్ ప్రతినిధి,ఆంధ్రప్రభ: కర్నూలు పట్టణంలోని ప్రధాన రహదారులు , ట్రాఫిక్ కూడళ్లు, ముఖ్య మైన రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఆధునిక మ్యాట్రిక్స్, AI సీసీ కెమెరాలు 24 గంటలపాటు నిఘా పర్యవేక్షణ కొనసాగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని , ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ( ఆటోలు , భారీ వాహనాలు , టూ వీలర్స్ , ఇతర అన్ని రకాల వాహనాలు) వాహనాలను ఆధునిక మ్యాట్రిక్స్ , A I సిసి కెమెరాల ద్వారా గుర్తించి, ఆటోమేటిక్ విధానంలో ఈ-చలాన్ ల జరిమానాలు విధిస్తామన్నారు.

ఆటోలను ట్రాఫిక్ లో ఎక్కడపడితే అక్కడ రోడ్డుకు అడ్డదిడ్డంగా నిలపడం, అధిక వేగంతో వాహనాలను నడుపుతూ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేయడం, స్నేక్ డ్రైవింగ్ , ర్యాష్ డ్రైవింగ్ , సైలెన్సర్లు తీసి వేసి బైక్ లు నడపడం, రెడ్ సిగ్నల్స్ దాటడం, మైనర్‌ డ్రైవింగ్ , ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి పలు రకాల ఉల్లంఘనలను సిసి కెమెరాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని విక్రాంత్ పాటిల్ తెలిపారు.

ప్రమాదాలను నివారించేందుకు అన్ని రకాల వాహనదారులు, ఆటోల డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. రక్షణ, పర్యవేక్షణ, నిఘా కొరకు 722 మ్యాట్రిక్స్ సిసి కెమెరాలతో పాటు,100 A I ( A I ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ) సిసి కెమెరాలకు సాంకేతికతను రూపొందించారన్నారు. నిబంధనలు పాటించని వారి పై చట్ట పరమైన చర్యలు తప్పవని , ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసు శాఖకు సహకరించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply