Actions | యాక్షన్ – రియాక్షన్..

Actions | ఉయ్యూరు, ఆంధ్రప్రభ : ఉయ్యురు మండలం గండిగుంట గ్రామంలోని రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్ లో ఆక్రమణకు గురైన డొంకను, జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు తవ్వకాలు చేపట్టి తిరిగి అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. సుమారు 40 సెంటు ప్రభుత్వ భూమిని, వ్యవసాయ భూమిగా మాదాల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించారు. 80 అడుగుల డొంక పూర్తిగా ఆక్రమణకు గురైందని, సర్వే నిర్వహించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త దయాకర్ బాబు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు.

Leave a Reply