Chennur | ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు : సీఐ దేవేందర్ రావు

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు (Chennur) గోదావరి తీరప్రాంతాల నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక (sand) అక్రమ రవాణా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ దేవేందర్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఉందయం మండలంలోని సుందరశాల (Sundersala) గోదావరి తీరం నుంచి సోమనపల్లి (Somanapally) గ్రామానికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం పట్టుకున్న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి సంబందితుల పై కేసు నమోదు చేశారు.

Leave a Reply