Action Aid | సామాజిక సమస్యలపై సమావేశం…

Action Aid | సామాజిక సమస్యలపై సమావేశం…
Action Aid | ఉట్నూర్, ఆంధ్రప్రభ : సామాజిక సమస్యలపై ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ఈ రోజు జాతీయ స్థాయి యాక్షన్ ఎయిడ్ సమావేశంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సామాజిక ఉద్యమ కార్యకర్త మర్సుకొల సరస్వతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ… మహిళలు, ప్రత్యేకంగా ఆదివాసీ పీవీటీజీ ఆదివాసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆమె వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అక్కడి ఆదివాసీ మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆమె లోతైన చర్చ చేశారు.
భూహక్కులు, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ, ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్థావించారు.సమాజ సేవలో ముందుండే సరస్వతి జిల్లా నుండి ఢిల్లీ లో జాతీయ స్థాయి సమావేశంలో మాట్లాడే అవకాశం రావడం గొప్ప విషయమని పలువురు కొనియాడారు. ముఖ్యంగా ఒక ఆదివాసీ పీవీటీజీ మహిళకు ఈ స్థాయి వేదికపై మాట్లాడే అవకాశం రావడం గర్వకారణమని సరస్వతి పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమావేశంలో వివరించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
