Achampeta | ప్రజావ్యతిరేక చట్టాలపై…

Achampeta | ప్రజావ్యతిరేక చట్టాలపై…
- రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం..
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు
Achampeta | అచ్చంపేట, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ నాగర్కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెల్దండ నుంచి అచ్చంపేట వరకు పోరుయాత్ర నిర్వహించారు. అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పాల్గొని ప్రసంగించారు.
కార్మిక చట్టాల సవరణలు, విత్తన–విద్యుత్ సవరణ బిల్లులు, ఉపాధి హామీ పథకంలో మార్పులతో కార్మికులు, రైతుల హక్కులు కాలరాస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, వచ్చే నెల దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం పేదలకు ఉపశమనం కలిగించిందని, దాన్ని దెబ్బతీయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, రైతు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
