రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం

రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం
- నిందితుడికి 13 రోజుల రిమాండ్
తిర్యాణి, ఆంధ్రప్రభ ; మండలంలోని మొర్రిగూడ రిజర్వ్ అటవీ ప్రాంతంలో చెట్లను నరికి అక్రమంగా సాగు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా 13 రోజుల రిమాండ్ విధించబడింది. మొర్లిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని లోహ ఆవాసానికి చెందిన ఆత్రం గంగు (తండ్రి: దస్వంత్ రావు) అనుమతి లేకుండా రిజర్వ్ అటవీ భూమిని ఆక్రమించి సాగు పనులు ప్రారంభించినట్లు సమాచారం. అప్రమత్తమైన అటవీ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అతడిని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి 13 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా తిర్యాని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ఉల్లంఘనను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మొర్రి గూడ FSO ఉజ్వల్ ప్రసాద్, FBO అనిల్ తదితర అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
