జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి…

జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి…

ఆలేరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం జర్నలిస్టులందరికీ చిన్న, పెద్ద పత్రికలు అన్న తేడా లేకుండా అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం జరిగింది. హెల్త్ కార్డులు అందజేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరుటూరు ఉపేందర్, సీనియర్ జర్నలిస్టులు ఎర్ర జాన్సన్, తోట మల్లయ్య, గుండు మహేందర్, ఎలగల కుమారస్వామి, దూడల సాగర్, వంగరి శివకుమార్, సిరిగిరి స్వామి, సీస సాయిరాం, సందెన శంకర్, గుండు మధు, మంచన మల్లేశం, బోడ నరేష్, కూళ్ల సిద్దులు, ఎలగల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply