Accidentally | భవనంపై నుంచి పడి..

Accidentally | భవనంపై నుంచి పడి..
Accidentally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పతంగి కోసం వెళ్లిన ఓ పదేళ్ల బాలుడు భవనంపై నుండి పడి మృతిచెందిన ఘటన నగరంలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో జరిగింది. నగరంలో ఉంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన మహేందర్, సుజాత దంపతుల కుమారుడు హేమంత్ (10) ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
