Accident | 9 మంది మృతి

Accident | 9 మంది మృతి
Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒకే కుటుంబానికి చెందిన 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులు ప్రమాదంలో మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దిండోరి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. నాసిక్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కారు బావిలో పడినట్లు పోలీసులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి చీకట్లో బావి గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో చనిపోయినవారు ఒకే కుటుంబానికి చెందినవారే. ప్రాణాల నష్టం తోటి గ్రామంలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించి, వారితో సంబంధిత వివరాలు సేకరిస్తున్నారు.
