Accident | గొర్రెల మేత కోసం వెళితే …మృత్యువాత ప‌డ్డారు..

హైద‌రాబాద్ – గొర్రెల మేత కోసం వెళ్లిన ఇద్ద‌రు యువకులు ఊహించ‌ని విధంగా మృత్యువాత ప‌డ్డారు.. ఈ ఘ‌ట‌న నేడు హైదరాబాద్ లోని యాకుత్ పుర రైల్వే స్టేష‌న్ వ‌ద్ద చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే యాకుత్‌పురా ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు తమ గొర్రెలను మేత కోసం సమీపంలోని రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలను కొట్టేందుకు అన్నదమ్ములు ఇద్దరు చెట్టు ఎక్కగా.. కొమ్మ విరిగి నేరుగా పట్టాలపై పడిపోయారు. అదే సమయంలో ట్రాక్‌పైకి అతవేగంతో వచ్చిన ట్రైన్ ఆ ఇద్దరు యువకులను బలంగా ఢీకొట్టింది దీంతో వారిద్ద‌రూ స్పాట్ లోను చ‌నిపోయారు..

Leave a Reply