భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి,:జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం రాంపూర్ -కమలాపూర్ మూలమలుపు రోడ్డు వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల కథనం ప్రకారం మహాముత్తారం మండలం మీనాజీపేటకు చెందిన పింగిలి రవీందర్ రెడ్డి (40), కొమ్మిడి నర్సింహారెడ్డి (లడ్డు) (36)భూపాలపల్లి వైపు నుండి వస్తుండగా పంబాపూర్ చెందిన సతీష్ ద్విచక్ర వాహనం పై ఎదురుగా వస్తుంది వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను భూపాలపల్లి జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.