యాదాద్రి జిల్లాలో లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో వెనుక నుంచి లారీని బలంగా ఢీ కొట్టింది.
.ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ప్రయాణికురాలు మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.