డల్లాస్ : అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు (Hyderabad ) చెందిన ఒక కుటుంబం (family ) సజీవ దహనమైంది (burned) . కారులో ప్రయాణిస్తున్న దంపతులు తేజస్విని ( tejeswini) , శ్రీవెంకట్ (srivenkat) తోపాటు వారి ఇద్దరు పిల్లలు సైతం మృతి చెందారు..
గ్రీన్‌కౌంటీ ఏరియాలో కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
శ్రీవెంకట్ కుటుంబం అట్లాంటా నుంచి డల్లాస్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకోగానే.. ఘటన స్థలానికి పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్పటికే కారులో మంటలు చెలరేగి.. వారంతా సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై భారత్‌లోని వారి బంధు మిత్రులకు సమాచారం అందించారు.
.