Accident | ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

మక్తల్ , (ఆంధ్రప్రభ) జాతీయ రహదారి 167పై ఆగి ఉన్న లారీని (lorry ) వోల్వో బస్సు {bus) ఢీకొన్న ఢీకొంది. ఈ సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయిఈ ప్రమాదం ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఐదుగురు(five ) పరిస్థితి విషమంగా (serious ) ఉన్నట్లు తెలిసింది

.ఇవాళ తెల్లవారుజామున కర్ణాటకలోని ( Karnataka ) శివమొగ్గ (sivamogga) నుండి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతున్న వోల్వో బస్సు మక్తల్ మండల పరిధిలోని బొందలకుంట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొంది. ఈ సంఘటనలో దాదాపు 18 మందికి గాయాలు కాగా అందులో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు .బస్సు డ్రైవర్ రెండు కాళ్లు విరిగిపోయినట్లు తెలిపారు .

గాయాలైన వారిని కర్ణాటకలో రాయచూరు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసుకున్న స్థానిక సిఐ రామ్ లాల్ ,ఎస్సై వై .భాగ్యలక్ష్మి రెడ్డి సిబ్బందితో తరలివెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేసి బాధితులను మొదటగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం కర్ణాటకలోని రాయచూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు లేదా లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Leave a Reply