Accident| మరో రోడ్డు ప్రమాదం..

Accident| మరో రోడ్డు ప్రమాదం..

Accident, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మర్రిపాడు మండలం నందవరం (Nandavaram) కూడలి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జామాయిల్ నాటే కూలీలు వస్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా పది మందికి గాయాలు అయ్యాయి. వీరిని 108 ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకొని సీఐ, ఎస్సైలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply