Accident | తప్పిన పెను ప్రమాదం..

Accident | తప్పిన పెను ప్రమాదం..

  • శ్రీశైలం ఘాట్‌లో కల్వర్టు ఎక్కిన టూరిస్ట్ బస్సు
  • ప్రయాణికులు క్షేమం

Accident | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఘాట్ సెక్షన్‌లో సోమవారం ఉదయం టూరిస్ట్ బస్సు అదుపు త‌పి్ప కల్వర్టు ఎక్కింది. ఏమాత్రం కొద్దిగా ముందుకు బస్సు వెళ్లినా లోయలో పడిపోయేది. ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ టూరిస్ట్ బస్సులో వ‌చ్చిన భ‌క్తులు విశాఖపట్నం నుంచి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లేందుకు బయలుదేరారు. బస్సులో భవానీ మాలధారులు 40 మందికి పైగా ఉన్నారు.

సోమవారం ఉదయం 7 గంటల సమయంలో దోర్నాల చెక్ పోస్ట్ దాటిన తర్వాత, శ్రీశైలంకు వెళ్లే ఘాట్ రోడ్‌లో ప్రమాదవశాత్తు బస్సు రహదారి పక్కన ఉన్న ప్రహరీ ఎక్కి నిలిచిపోయింది. గోడపై ఆగకుంటే బస్సు లోయలో పడి భారీ ప్రమాదం సంభవించేది. డ్రైవర్ చాకచక్యంతో ఆఫ్ చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ ప్రొక్లెయిన్ సహాయంతో బస్సును కిందికి దించేందుకు పోలీసులు దేవస్థానం సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply