ఆసుపత్రిలో చికిత్స పొందుతు వ్యక్తి మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతు వ్యక్తి మృతి
ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమా తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన కొమిరి అంజయ్య ఈనెల 9న తన ద్విచక్ర వాహనంపై కుర్నాపల్లి గ్రామంలో తన ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి, వాహనంతో సహా కిందపడి తీవ్రగాయాలు కాగా నిజామాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృత్యువాత పడ్డారని మృతుని తమ్ముడు రామస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
