లారీ బీభత్సం.. ప్రమాదంలో మామా అల్లుళ్లు దుర్మరణం

లారీ బీభత్సం.. ప్రమాదంలో మామా అల్లుళ్లు దుర్మరణం

  • నకరికల్లు అడ్డరోడ్డు వద్ద కంటైనర్ లారీ బీభత్సం
  • లారీ ఢీకొన్నడంతో మామా అల్లుళ్లు దుర్మరణం

నకరికల్లు, ఆంధ్రప్రభ: ​నకరికల్లు అడ్డరోడ్డు వద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై అతివేగంతో వచ్చిన ఒక కంటైనర్ లారీ పెను బీభత్సాన్ని సృష్టించింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ కంటైనర్ లారీ అదుపు తప్పి తొలుత రహదారి మధ్యలో ఉన్న సీసీ కెమెరాల స్తంభాన్ని బలంగా ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు పక్కన నిలిపి ఉన్న స్కూటీని, మినీ లారీని ఢీకొంటూ బోల్తా పడింది.

ఈ ఘోర ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన జల్లా గురుమూర్తి (55), గుంటూరు లక్ష్మీపురానికి చెందిన గోపిదేశి సత్యనారాయణ (45) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులిద్దరూ వరుసకు మామా అల్లుళ్లు కావడం గమనార్హం. వీరు ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలోని తమ మామిడి తోటకు మందు కొట్టే పని ముగించుకుని స్కూటీపై తిరిగి వస్తూ దాహం తీర్చుకోవడానికి నకరికల్లు అడ్డరోడ్డు వద్ద ఆగిన సమయంలో మృత్యువు లారీ రూపంలో వచ్చి వారిని కబళించింది. ఈ ఘోర ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన జల్లా గురుమూర్తి (55), గుంటూరు లక్ష్మీపురానికి చెందిన గోపిదేశి సత్యనారాయణ (45) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులిద్దరూ వరుసకు మామా అల్లుళ్లు కావడం గమనార్హం. వీరు ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలోని తమ మామిడి తోటకు మందు కొట్టే పని ముగించుకుని స్కూటీపై తిరిగి వస్తూ దాహం తీర్చుకోవడానికి నకరికల్లు అడ్డరోడ్డు వద్ద ఆగిన సమయంలో మృత్యువు లారీ రూపంలో వచ్చి వారిని కబళించింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్‌లను స్థానికులు మరియు పోలీసులు 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

మధ్యాహ్నం ఎండ తీవ్రత వల్ల ఆ సమయంలో జనం తక్కువగా ఉన్నారని అదే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఈ ప్రమాదం జరిగి ఉంటే ప్రమాద తీవ్రత భారీగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply