Accident | ట్రావెల్ బస్సు బోల్తా..

Accident | ట్రావెల్ బస్సు బోల్తా..

  • ముగ్గురు అయ్యప్ప స్వాములకి స్వల్ప గాయాలు

Accident | చిల్లకూరు, ఆంధ్రప్రభ : గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని జాతీయ రహదారిపై రైటర్ సత్రం వద్ద 35 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న‌ బస్సు అదుపుతప్పి బోల్తా(Topple out of control) పడింది. పోలీసుల వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమీపంలో పల్నాడు జిల్లా గురజాల నుంచి శౌర్యన్ ట్రావెల్ బస్సు 35 మంది అయ్యప్ప స్వాములతో బయలుదేరి శబరిమలై(Sabarimalai) వెళుతుండగా అదే మార్గంలో లారీ టైరు పగిలిపోయి ఆగిపోయింది.

ఆ లారీని తప్పించపోయిన ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన పడిపోయింది. ఆ లారీని తగిలి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు(police) తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న లింగ ఆదినారాయణ, పూడెల సతీష్, శిరసన గమలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిల్ల‌కూరు ఎస్సై సురేష్ బాబు(SI Suresh Babu) సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన క్రేన్ ద్వారా బస్సును మరల పునరుద్ధ‌రించడం జరిగింది. ప్ర‌మాదంపై లింగం ఆదినారాయణ చిలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply