Accident | 13 మంది మృతి ఎక్క‌డంటే…

Accident | 13 మంది మృతి ఎక్క‌డంటే…

Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బ‌స్సు అదుపుతప్పి లోయలో పడి 13మంది మృతిచెందగా, పలువురికి గాయాలైన విషాద ఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి నేపాల్‌లో బైటడి జిల్లా పూర్చౌడి మున్సిపాలిటీ 7లో భావానే నుంచి బజాంగ్‌కు ఓ పెళ్లి బస్సు వెళ్తోంది. కొండప్రాంతాలు కావడంతో బస్సుపై డ్రైవర్‌ పట్టు కోల్పోయాడు. బడ్గౌన్ మోడ్‌ వద్ద బస్సు లోయలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, సైనిక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన 45 మందిని ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో 16 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది.

Leave a Reply