ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. మణికొండ (Manikonda) లో విద్యుత్‌శాఖ ఏడీఈ ఇంటి నుంచి మొదలైన ఈ సోదాలు నగరంలోని పలు ప్రాంతాల్లో కలకలం రేపాయి. మణికొండలో విద్యుత్‌శాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ (ADE) అంబేడ్కర్‌ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అధికారులు ఈ తనిఖీలు జరిపారు.

అంతేకాకుండా, గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్‌ (Madapur) పరిసర ప్రాంతాల్లోని ఏడీఈ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులు ఈ ప్రాంతంలో చర్చనీయాంశమయ్యాయి. అధికారిక ప్రకటనను ఏసీబీ త్వరలోనే విడుదల చేయనుంది.

Leave a Reply