పోకిరిల పై చర్య తీసుకోవాలి..

పోకిరిల పై చర్య తీసుకోవాలి..
ఎస్సై కి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నేతలు
చిట్యాల,ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో కొందరు మద్యం మత్తులో ,పోకిరిలు బైకులు అతివేగంగా నడుపుతూ, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఎస్సై పోచంపల్లి సతీష్ కు వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలో కొంత మంది యువకులు బైక్స్ పై స్టంట్ చేస్తూ పరీక్షల కేంద్రం ల వద్ద,చౌరస్తా ,గురుకుల బాలికల పాఠశాల వద్ద తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నార ని తెలిపారు.
మద్యం మత్తులో బైక్ లపై అధిక వేగంతో వెళ్తూ ప్రమాదాలు గురి చేస్తు విద్యార్థినిలు , ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని , అలాంటి వ్యక్తులపైన పోలీస్ నిఘ ఉంచాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈకార్యక్రమంలో ఏబీవీపీ చిట్యాల నగర కార్యదర్శి ముష్కే అజయ్, సరిగొమ్ముల శశివర్ధన్ ,అక్షయ , మాన్సి తదితరులు పాల్గొన్నారు.
