నిజామాబాద్ ప్రతినిధి, జులై 18(ఆంధ్రప్రభ) : నయనానందకరంగా శాకాంబరి (Sakambari) అలంకరణలో వాసవీ కన్యకా పరమేశ్వరి (Vasavi Kanyaka Parameshwari) మాతకు వైభవంగా జలాభిషేకాలు చేశారు. నిజామాబాద్ నగరంలోని గంజి ప్రాంతంలో గల కన్యకా పరమేశ్వరి ఆలయంలో నూతన ఆలయ కమిటీ (Temple Committee) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు.
శుక్రవారం ఉదయం నగరంలోని శంభుని గుడి నుంచి గంగా జలాలతో సుహాసినీలు కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చా రు. నగరంలోని ప్రధాన వీధుల గుండా వాసవి మాతాకీ జై అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అమ్మ వారికి గంగాజలాలతో అభిషేకం చేసిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలలో సుహాసినీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

