A11 Allu Arjun | సంధ్య తొక్కిసిలాట కేసులో..
- చార్జీషీట్ దాఖలు చేసిన చిక్కడిపల్లి పోలీసులు
Allu Arjun | హైదరాబాద్, ఆంధ్రప్రభ : సినీ హీరో బన్నీకి సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు వదల లేదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ థియేటర్ వద్ద గత ఏడాది తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ‘పుష్పా-2’ సినిమా(‘Pushpa-2’ movie) విడుదల సందర్భంగా సంధ్య థియేటర్(Hyderabad Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటపై తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ ఛార్జిషీట్‌లో అల్లు అర్జున్‌ను ఏ-11గా పేర్కొన్నారు. ఇక సంధ్య థియేటర్ మేనేజ్మెంట్‌ను ఏ-1గా చేర్చారు. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. అల్లు మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు ఎనిమిది మంది బౌన్సర్లను ఛార్జిషీట్‌లో దాఖలు చేశారు.

‘పుష్పా-2’ మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సుధీర్ఘకాలం చికిత్స పొందిన తర్వాత బాలుడు డిశ్చార్జి అయ్యారు. చికిత్సకు అయిన ఖర్చు మొత్తం హీరో అల్లు అర్జున్ కుటుంబమే చూసుకుంది.

