పేదింటి ఆడబిడ్డకి పెళ్లి కానుక

వెల్దండ, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల సమీపంలోని రాచూర్ గ్రామ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాసులు తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల సమయంలో ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 పెళ్లి కానుకగా అందజేస్తానని ఇచ్చిన హామీ మేరకు శనివారం రాచూర్ గ్రామానికి చెందిన మన్నేమోని రామస్వామి కుమార్తె సంధ్య వివాహానికి రూ.10,116 పెళ్లి కానుకను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గూళ్ల జంగయ్య, మధార్, రాస్కెల్ జంగయ్య, రామకృష్ణ, సురేష్ రెడ్డి, దుబ్బ పాండు, చెట్ల శ్రీశైలం, టి. శ్రీను, గంగదారి రమేష్, కొంగళ్ల బీరయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply