మంచులో చిక్కుకున్నవెయ్యి మంది
ఆంధ్రప్రభ ఇంటర్నేషనల్ డెస్క్ : ఎవరెస్ట్ (Mom, Everes) పై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. సుమారు వెయ్యి మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టిబెట్ ఎవరెస్ట్(Tibet Everest) పర్వతం (Snowestern on Mount Everes) తూర్పువాలు వైపు శుక్రవారం సాయంత్రం నుంచి దట్టంగా మంచు కురుస్తోంది.
ఆదివారానికి అది మంచు తుపానుగా మారింది. దీంతో దాదాపు వెయ్యి మంది క్యాంప్ సైట్ల(camp sites) వద్ద చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 350 మందిని రక్షించారు. ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చరియలు పడిదారులు మూసుకుపోయాయి. దీంతో వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు, రెస్క్యూ(Rescue) సిబ్బంది శ్రమిస్తున్నాడు.
‘మరోవైపు, నేపాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసించే మెరుపు వరదలు, కొండవరియలు విరిగిపడటం కారణంగా ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు.