కర్నూలు బ్యూరో, సెప్టెంబర్ 4, ఆంధ్రప్రభ : కని, పెంచి పెద్దచేసిన తండ్రిని కడదాకా కంటికి రెప్పలా కాపాడుకుని, కాటికి పంపి తలకొరివి పెట్టాల్సిన కొడుకే (Son) కాలయముడై కన్న తండ్రి (father) ని కడతేర్చాడు. ఏ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాడో ఆ ఉద్యోగమే అతడిపాలిట యమపాశమైంది. కన్నకొడుకు చేతిలో హతమయ్యేందుకు కారణమయ్యింది…సభ్యసమాజం నివ్వెరపోయే ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి…

కోడుమూరు (Kodumuru) మండలం, పులకుర్తి గ్రామంలో తండ్రిని‌ హత్య చేసాడు కుమారుడు. మృతుడు రామాచారి ఆర్టీసీ డ్రైవర్ (RTC driver). గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన కొడుకు వీరాచారి రోకలితో బాది చంపినట్లు సమాచారం. తండ్రి ఆర్టిసి ఉద్యోగం చేస్తున్నారు..

అతను చనిపోతే ఉద్యోగం తనకు వస్తుందని ఉద్దేశంతో రామాచారి (Ramachari) కొడుకు కుమారుడు వీరాచారి దుర్బుద్ధితో తండ్రిని హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. అర్ధరాత్రి సుమారు 3 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రామాచారి తలకు తీవ్ర గాయాలై మృతిచెందారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేనట్లు సమాచారం..

Leave a Reply