BIG BREAKING | దూసుకొచ్చిన మృత్యువు..

  • వికారాబాద్‌లో కారు బీభత్సం
  • మహిళ మృతి, నలుగురికి గాయాలు

వికారాబాద్ టౌన్, (ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఏపీ కళాశాల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అదే కారు రోడ్డు పక్కన ఆగిన మరిన్ని వాహనదారులపై దూసుకెళ్లడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

మృతురాలు భారతి, భర్త తులసిరామ్ వికారాబాద్ పట్టణానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంలో తులసిరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిని కర్నూలు జిల్లాకు చెందిన శీను, లక్ష్మణ్, చిన్నగా పోలీసులు గుర్తించారు. అనంతగిరిగుట్ట జాతర సందర్భంగా చిరు వ్యాపారం చేయడానికి వికారాబాద్‌కు వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యారు. కారు నడిపిన వ్యక్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply