కర్నూల్ బ్యూరో, ఆగస్టు 20, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా (Kurnool District), ఆస్పరి మండలం పరిధిలోని చిగిలి గ్రామం (Chigili Village) లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వద్ద ఉన్న ఓ నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు అందులో మునిగిపోయారు. ఆరుగురు మృతి చెందారు (Six children died). మృతులంతా ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘ‌న‌ట‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply