హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఎక్కడమే పాపమా? సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం ముఖ్యమంత్రి గారు? అంటూ ప్రశ్నించారు. ఈరోజు ఎక్స్ వేదికగా పోస్టు చేసిన కవిత.. మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్‍ల ధరలు భారీగా పెంచి చిరుద్యోగులు, నగర ప్రజలపై పెనుభారం మోపారని పేర్కొన్నారు. ఇప్పుడు బస్ చార్జీలను అమాంతం పెంచేశారని ధ్వజమెత్తారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని మండిపడ్డారు.
చార్జీల పెంపుపై కవిత మండిపాటు
