PETITION| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూనెపల్లి ప్రాంతం 127 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో చేరిందని, ఇది ఏమాత్రం అభివృద్ధి సాధించలేదని రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎం బాడీ ఫరూక్ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్నిఅభివృద్ధి చేయాలని కమిటీ కన్వీనర్ అడ్వకేట్ శంకరయ్య డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలోని నూనెపల్లికు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఒకనాడు ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా కళకళలాడుతుండదన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి రావటం వల్ల అభివృద్ధి ఆగిపోయి మురికివాడుగా మారిపోయిందన్నారు.
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని మంత్రిని కోరారు. నంద్యాల మున్సిపాలిటీలో నూనెపల్లె ప్రాంతం 1896 సంవత్సరంలో విలీనమైందన్నారు. ఈ నూనె పల్లె ప్రాంతంలో 9 కౌన్సిల్ అవార్డులు ఉన్నాయన్నారు. పార్టీలో 50వేల జనాభా ఉందని.. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పడడంతో ఈ ప్రాంతం మురికివాడ ప్రాంతముగా ఏర్పడిందని ఆరోపించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన రోడ్డు, బవ నాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రోడ్డు వెయ్యాలన్నారు. పార్కు రీడింగ్ రూమ్ ఆటో ట్రాఫిక్ నియంత్రణకు కానిస్టేబుల్స్ ఇక్కడ నియమించాలని కోరారు. నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పబ్లిక్ మీటింగ్ ల కొరకు వేదికను ఏర్పాటు చేయాలని కోరారు.
కరెంట్ ఆఫీస్ దగ్గర శ్యామకాల్లో పై ఆర్ అండ్ బిడ్జి వెడల్పు చేయాలని కోరారు. అన్న క్యాంటీన్ దగ్గర ఎన్జీవో కాలనీకి వెళ్లే సెంటర్లో సిగ్నలైట్ ఏర్పాటు చేయాలని ప్రమాదాలు నివారించాలని కోరారు. నూనెపల్లె మార్కెట్ యార్డులోని పశువుల సంత ఈ ప్రాంతంలో ఉండటం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పశువుల సంతను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. నూనెపల్లి సెంటర్లో మున్సిపల్ కంపోస్టు ఎత్తివేయాలని కోరారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రజలకు అనేక రోగాలు వస్తున్నాయని ఆరోపించారు.
ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మంత్రిని కోరారు. మంత్రి మాట్లాడుతూ ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో చంద్రమౌళీశ్వర రమణీయ గౌడ్ ధనుంజయతో పాటు తోట భూపాల్ బాల ఉసేనయ్య చెరుకు రామస్వామి ఇత్తా నారాయణ గౌడ్ సుధాకర్ పార్టులు రామ్మూర్తి బషీర్ శిల్పారామన్న తోట పెద్ద మద్దిలేటి నాగరత్నం బాబు లాయర్ జీవీ రమణ లాయర్ పి శ్రీనివాసులు పునీత్ బాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

