రేణిగుంట పంచాయతీ చకచక
( రేణిగుంట, ఆంధ్రప్రభ) : మొంథా తుఫాను (Montha Cyclone) ప్రభావంతో రేణిగుంట పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరడంతో గ్రామపంచాయతీ ఇన్ చార్జీ సెక్రటరీ రమేష్ జేసీబీ సాయంతో తరలించారు. మంగళవారం కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రాంతాల నుంచి లోపటి ప్రాంతాలకు అధికంగా నీరు తరలివస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి (Railway underbridge) కింద వర్షపునీరు అధికంగా చేరడంతో రేణిగుంట ఇంచార్జ్ పంచాయతీ సెక్రటరీ రమేష్ తమ సిబ్బందితో చేరుకొని జేసీబీ సాయంతో వర్షపు నీరుని తరలించారు. రోడ్డు పక్కన అడ్డంగా ఉన్న ఐరన్ ఫోల్ ను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ఇంచార్జ్ సెక్రెటరీ రమేష్ ను పట్టణ ప్రజలు అభినందించారు.

