ఇలాంటి నాయకుడు కావాలి…

తాడ్వాయి (ఆంధ్ర ప్రభ): తాడ్వాయి గ్రామానికి చెందిన దమ్మన్న రాజేశ్వర్ రెడ్డి (Dammanna Rajeshwar Reddy) తన సొంత డబ్బుతో మొరం రోడ్డు వేయించి అందరితో శభాష్ అనిపించాడు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోయినా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు వేయించి అందరి గుండెల్లో నిలిచిన మంచి మనసున్న నాయకుడు అనిపించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే… తాడ్వాయి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు (Congress Party senior leader ) దమ్మున్న రాజేశ్వర్ రెడ్డి తన సొంత గ్రామంలో మండల ఆఫీసు నుండి చిట్యాల రోడ్డు వరకు గుంతల మయంగా మారడంతో, తాడ్వాయి, చిట్యాల, సంతాయిపేట్ గ్రామాల వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ గుంతలో పడి గాయపడిన సంఘటనలు ఉన్నందున, ప్రజల కష్టాలు చూడలేక తన సొంత డబ్బు 2,50,000 ఖర్చుపెట్టి రోడ్డును బాగు చేయించారు.

పార్టీ తరఫున ఎలాంటి కాంట్రాక్టు లేకున్నా లాభం ఆశించకుండా తన సొంత డబ్బులతో రోడ్డు వేయిండం పట్ల ప్రజలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పదవులు ఉండి పని చేయని నాయకుల కన్నా, ఏ పదవి లేకున్న ప్రజల కష్టాలకు చలించి పని చేయడం మామూలు విషయం కాదు అని అంటున్నారు. ఇలాంటి మానవత్వం ఉన్న నాయకుడు కావాలంటున్నారు ప్రజలు.

Leave a Reply