పరకాలలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాలలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం రోజు పరకాల పట్టణం అమరధామంలో తెలంగాణ రైతు సంఘం, రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, రైతంగ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికల కిషన్ రావు మాట్లాడుతూ.. హనంకొండ జిల్లా పరకాల డివిజన్లో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రానికి కావలసిన భూమి నడికుడ మరియు ఇతర మండలాలలో ప్రభుత్వ భూమి ఉన్నది. పరకాల డివిజన్ ప్రాంతంలో శాయంపేట, రేగొండ, మొగుళ్ళపల్లి, నడికూడా ప్రాంత రైతులకు సుమారుగా 120 గ్రామాలకు పంటలలో వచ్చే సమస్యలకు ఆర్ఏఆర్ఎస్ వరంగల్ కు పోవలసిన అవసరం ఏర్పడతుంది.
పరకాలలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత రైతులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంత రైతులు అనేక రకాల పంటలు పండిస్తారు. రైతులు సాగు చేసే పంటలకు సలహా సూచనలకు ఉంటుంది. జిల్లా కలెక్టర్ మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు హనంకొండ జిల్లాకు కేటాయించిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని పరకాల డివిజన్లో ఏర్పాటు చేసి రైతుల సమస్యలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది.
దీన్ని ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు డివిజన్ అధికారులు ఆలోచించి పరకాలలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించాలని తెలంగాణ రైతు సంఘం, రైతు రక్షణ సమితి జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊరటి అంశాలరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సోమిడి సాంబయ్య, గూడ సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
