నెపాల్‌లో తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని నియమించారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకోవడంతో అప్పటి ప్రధాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక నేపాల్ పార్లమెంట్‌ను అధ్యక్షుడు రద్దు చేశారు.
సుశీల కర్కి – ఒక కొత్త అధ్యాయం…
సుశీల కర్కి (73) మరికాసేపట్లో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా మాత్రమే కాకుండా, నేపాల్‌కు తొలి మహిళా తాత్కాలిక ప్రధానిగా కూడా ఆమె చరిత్ర సృష్టించబోతున్నారు.

