భార్య విడాకులు.. లాటరీ టికెట్‌కు జాక్‌పాట్

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భార్యకు విడాకులిచ్చిన భర్తకు జాక్‌పాట్ తగిలింది. న్యూజెర్సీకి చెందిన మైక్ వీరేన్కీ, 15 సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉన్నందున అతని భార్య విడాకులు కోరింది. అతని కనీస అవసరాలను కూడా తీర్చలేకపోతున్నాడని ఆమె కోర్టులో వాదించింది. ఆమె కష్టాలను అర్థం చేసుకున్న కోర్టు విడాకులను మంజూరు చేసింది. భరణంగా కొంత డబ్బును తీసుకుని ఆమె వెళ్ళిపోయింది.

ఆ తర్వాతే అతని జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. అతను కొన్న లాటరీ టికెట్‌కు రూ.2.28 వేల కోట్లు జాక్‌పాట్ తగిలింది. ఈ వార్త అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోయి, రకరకాలుగా స్పందించారు. ‘డబుల్ జాక్‌పాట్ కొట్టావ్ బ్రో’ అని కొందరు, ‘నిన్ను వదిలివెళ్లిన భార్య ఇప్పుడు డబ్బు చూసి మళ్ళీ తిరిగి వస్తుంది’ అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ సంఘటన భర్త జీవితంలో ఒక అద్భుతమైన మలుపును తీసుకువచ్చింది. ఇది అతనికి అదృష్టం, అలాగే కొత్త జీవితాన్ని తెచ్చిపెట్టింది. నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడిన అతనికి ఇప్పుడు ఆర్థికంగా స్వేచ్ఛ లభించింది.

Leave a Reply