ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ఎస్సైకి ఘన సన్మానం

వెల్దండ, ఆంధ్రప్రభ ; వెల్దండ మండల కేంద్రంలోని శ్రీ సేవాలాల్ ఆటో యూనియన్ నూతన కమిటీ అధ్యక్షులు పోలే తిరుపతయ్య, ఉపాధ్యక్షులు పకాడి అంజయ్య, ల ఆధ్వర్యంలో మంగళవారం వెల్దండ ఎస్సై కురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్సై కురుమూర్తి మాట్లాడుతూ ఆటోలకు సంబంధించిన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేస్తూ సరైన పత్రాలు ప్రతి ఒక్క డ్రైవర్ అందుబాటులో ఉంచుకోవాలంటూ అలాగే ఆటోలకి సంబంధించిన ఇన్సూరెన్స్, ఫిట్నెస్ పేపర్లని ఎప్పటికప్పుడు సరిచూసు కోవాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి పోలీస్ సిబ్బందికి, వాహనదారులకు సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సముద్రాల లింగయ్య, కోశాధికారి శ్రీను నాయక్, రామాంజనేయులు, సలహాదారులు లాలయ్య, లక్ష్మణ్ నాయక్, చంద్యనాయక్, శివ నాయక్, పోలే రాజు, ప్రవీణ్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply