మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఘన సత్కారం

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పెండెం లక్ష్మీ రామానంద్ ని, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గంధం నరేందర్ ని, నర్సంపేట మేర కుల సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సన్మానించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేర పట్టణ అధ్యక్షులు రామగిరి రవికుమార్ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పెండెం లక్ష్మీ రామానంద్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, మేర సమాజానికి కూడా న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆకాంక్షించారు. సమాజ అభ్యున్నతికి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్య కార్యదర్శి గట్ల రజినీకాంత్, మాట్లాడుతూ, మేర సమాజం ఎప్పటినుంచో సామాజికంగా వెనుకబడిన వర్గంగా ఉన్నప్పటికీ, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. చైర్పర్సన్ నాయకత్వంలో సమాజానికి మరింత గుర్తింపు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గంగాపురం ప్రకాష్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రామగిరి నాగరాజు, జిల్లా కోశాధికారి రామగిరి యాదగిరి స్వామి, మండల అధ్యక్షులు ఓడపెల్లి గోవర్ధన్, పట్టణ కార్యనిర్వహణ అధ్యక్షులు ఓదెల సురేష్, మాజీ అధ్యక్షులు ఓదెల రవీందర్ (విజేత), పట్టణ ఉపాధ్యక్షులు ఓదెల (కిరణ్ టైలర్), ఉపాధ్యక్షులు గట్ల శ్రీను (బాలాజీ టైలర్), సలహాదారులు ఓదెల సాంబయ్య, కమిటీ సభ్యులు ఓదెల వీరన్న (దిలీప్ టైలర్), రామగిరి వీరేందర్, రామగిరి రాజేందర్, ఓదెల మల్లయ్య, ఓదెల రవి, గట్ల బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్. మాట్లాడుతూ, తాను అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. మేర సమాజ అభ్యున్నతికి కూడా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మేర సంఘం ప్రతినిధులు ఈ సత్కార కార్యక్రమం ద్వారా తమ ఐక్యతను, సమాజ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.
