సర్ మేడి దేవురావుకు ఘనంగా అంతిమ వీడ్కోలు

జైనూర్ , ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి సర్మేడి జుగునక దేవురావు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలు శుక్రవారం మార్లవాయిలో నిర్వహించారు . ఈ అంతిమ అంత్యక్రియ వీడ్కోలలో ప్రజా ప్రతినిధులు నాయకులు సర్పంచులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేహానికి ఆదివాసి సాంప్రదాయ బద్ధంగా నివాళులు అర్పించారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావు, జై నూర్ మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, బిజెపి అసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కోట్నాక్ విజయ్ కుమార్, రాయి సెంటర్ల సర్ మేడిలు ఆనందరావు, బాజీరావు, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, జైనూర్ మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు మడావి భీమ్రావు, సర్పంచులు కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, కుమ్ర భీమ్రావు, ఆత్రం మీరా జాలింషా, పెందూర్ గణపత్ రావ్, తొడసం రాజేందర్, ఆదివాసి నాయకులు, గ్రామాల పటేల్ లు, మార్లవాయి బంధుమిత్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
