ప్రతిభ వెలికితీయాడానికి మంచి వేదిక

ప్రతిభ వెలికితీయాడానికి మంచి వేదిక

ములుగు, ఆంధ్రప్రభ జిల్లా ప్రతినిధి : జిల్లాలో గిరిజన యూనివర్సిటీ(University) ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు అందుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)అన్నారు.

ఈ రోజు జిల్లా కేంద్రంలో గట్టమ్మ గుట్ట వద్ద సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) సెంట్రల్ ట్రైబల్ విశ్వవిద్యాలయం కోసం 24 కోట్ల నిధులతో 8.4 కిలోమీటర్ల ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జి నాగేష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్‌(Y.L. Srinivas)లు పాల్గొన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లాకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని, గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానిక వేదిక అవుతుందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ గిరిజన సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులను సమకూర్చుతామని తెలిపారు.

యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు అందుతాయని, విద్యా రంగంలో కొత్త అధ్యాయం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల కోసం ఆధునిక లైబ్రరీలు( Libraries), ల్యాబరేటరీలు, హాస్టల్స్, తరగతి గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు.

ప్రజా ప్రభుత్వం గిరిజన సంక్షేమం, విద్యా అవకాశం కోసం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ములుగు(Mulugu) జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విద్యా రంగంలో కొత్త మైలురాయిని సృష్టిస్తుందన్నారు.

త్వరలోనే క్యాంపస్ నిర్మాణం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, తెలంగాణ(Telangana) ప్రాంతానికి సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసిన దేశ ప్రధాని, స్థానిక కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ(Central Tribal University)లో రాబోయే ఐదు సంవత్సరాలలో 3 వేల నుంచి 5 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించనున్నారని జిల్లా క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

సెంట్రల్ గిరిజన యూనివర్సిటీలో ప్రస్తుతానికి 42 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, కేంద్ర ప్రవేశ lపరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని ఇతర రాష్ట్రాల గిరిజన విద్యార్థులు కూడా ఇక్కడ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్(Ravi Chander), మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారామ్ నాయక్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply