- ఇష్టారీతిన ధరల నిర్ణయం
- ఆదినాథ్ కాటన్ మిల్లు యాజమాన్యంతో వాగ్వదానికి దిగిన రైతులు
- అక్కడ రిజెక్ట్ చేసిన పత్తికి వేరే జిన్నింగ్ మిల్లులో ఫుల్ రేట్
కన్నెపల్లి, ఆంధ్రప్రభ : కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని ఆదినాథ్ జిన్నింగ్ మిల్లులో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలులో పలు అవకతవకలు జరుగుతున్నాయని పత్తి రైతులు ఆందోళనలకు దిగారు.
ఆదినాథ్ యాజమాన్యం రైతులను తేమ పేరుతో భయందోళనలకు గురి చేస్తున్నారని, సీసీఐ నిబంధనలకు విరుదంగా ప్రవర్తిస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చిన పత్తిని కౌడి, చెత్త, తేమ పేరుతో నిబంధనలకు విరుదంగా తక్కువ రేట్ కి కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచుతున్నారని అన్నారు.
ఇక్కడ రిజెక్ట్ చేసిన పత్తి శ్రీరామ్ ,మహేశ్వరి మిల్లుల్లో ఫుల్ రేట్ కి కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది రైతులు సీసీఐ కి వేసుకునే పత్రాలు లేకపోతే బయట వారి వద్ద ప్రైవేట్ కి 6950 కి కొనుగోలు చేసి సీపీఓ కింది అధికారులు తమ వద్ద ఉన్న నకిలీ పత్రాలు సమర్పించి సీసీఐ కి వేసి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు అని రైతులు వాపోతున్నారు.

