నిలిచిన విద్యుత్ సరఫరా
ఎండపల్లి , ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా (Jagitial district) ఎండపల్లి మండల కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి ఒక భారీ వృక్షం నెలకొరిగింది. చెట్టు కరెంటు తీగలపై పడిపోవడంతో విద్యుత్ స్తంభం విరిగి, తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి తీసుకున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మరమ్మతు పనులు ప్రారంభించారు.

